--14.12.2020--
ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు.
👉 కేరళ త్రిస్సూర్‌లోని ఓ బేకరికీ జనాలు విపరీతంగా వెళ్తున్నారు. అక్కడ టీ తాగేందుకు బారులు తీరుతున్నారు. టీ కన్నా కప్‌నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఛాయ్ తాగగానే కప్‌ను తినేస్తున్నారు. ఛాయ్ ఎంత వేడిగా ఉన్నా ఈ కప్ 20 నిమిషాల పాటు మెత్తబడకుండా ఉంటుంది. రాధాకృష్ణ బేకరీలో లభించే ఈ ప్రత్యేకమైన టీ ధర కేవలం 20 రూపాయలే. వినూత్నంగా ఆలోచించి 'బిస్కెట్ కప్ టీ' ని అమ్ముతున్నాం. కొద్ది రోజుల్లోనే దీనికి మంచి ఆదరణ లభించింది. ప్రారంభించిన మొదటి రోజు నుంచే జనాలు విపరీతంగా వస్తున్నారు. యువత ఎక్కువగా మా బేకరీకి వస్తుంటారు." ఈ బిస్కెట్ కప్‌లు హైదరాబాద్‌లోనే తయారవడం విశేషం. రానున్న రోజుల్లో వెనీలా, చాక్లెట్ ఫ్లేవర్ కప్‌లు తయారు చేసేందుకు సంబంధిత తయారీ సంస్థ యోచిస్తోంది.
👉 ఓవైపు చిన్నారి మెదడులోని కణతిని తొలగించే ప్రక్రియలో వైద్యులు నిమగ్నమైతే.. మరోవైపు పియానో వాయిస్తూ, వైద్యులతో ముచ్చటిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది చిన్నారి. మధ్యప్రదేశ్ బిర్లా ఆసుపత్రి వైద్యులు ఇలా వినూత్నంగా శస్త్రచికిత్స చేసి బాలికను రక్షించారు. ఆపరేషన్ సమయంలో చిన్నారి పక్షవాతానికి గురికాకుండా పియానో వాయించమని సూచించినట్లు వైద్యులు తెలిపారు.
👉 అసోం బోడోల్యాండ్ ప్రాదేశిక మండలి(బీటీసీ) ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన వేళ.. కొత్త పొత్తులు పొడిచాయి. ప్రస్తుతం అక్కడ బోడో పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్), భాజపా కూటమి అధికారంలో ఉన్నా.. బీపీఎఫ్‌కు బై చెప్పి మరో పార్టీ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్(యూపీపీఎల్)ను కూటమిలో చేర్చుకుంటున్నట్లు ప్రకటించింది కమలదళం.
👉 500 ఏళ్లనాటి ఆలయంలో బయటపడ్డ బంగారం.
తమిళనాడులోని ఓ పురాతన ఆలయ పునరుద్ధరణ పనులు చేపడుతుండగా.. భారీగా బంగారం బయటపడింది. ఈ సంఘటన కాంచీపురం జిల్లా ఉత్తీరమీరుర్లో జరిగింది.వాటిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
👉భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతమయ్యారు. మృతులను డార్రేకాసా, మలాజ్‌ఖండ్ దళాల సభ్యులు సావిత్రి, శోభగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన ఇద్దరు మోస్టువాటెంట్ మావోయిస్టులని నక్సల్ ఆపరేషన్ అదనపు డీజీ జీపీ సింగ్ తెలిపారు.
👉హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడిగా మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా హన్మంతనాయక్ మూడవసారి తిరిగి ఎన్నికయ్యారు. ఆదివారం ఆ సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు జరిగిన ఎన్నికలలో వీరు ఎన్నికయ్యారు. మొత్తం 262 మంది వివిధ శాఖల గ్రూప్-1 అధికారులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఓటింగ్‌లో పాల్గొన్నారు. చంద్రశేఖర్ గౌడ్‌కు 162 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి అజయ్ కుమార్‌కు 100 ఓట్లు వచ్చాయి.
👉ముంబై: చెక్కు చెల్లింపుఆ కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) 'పాజిటివ్ పే సిస్టమ్' ను ప్రవేశపెట్టింది. దీని కింద రూ.50 వేలకు పైన ఉన్న చెక్కులకు అవసరమైన సమాచారం మళ్లీ నిర్ధారించనున్నారు. చెక్ చెల్లింపుల కోసం ఈ కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. చెక్ చెల్లింపులను సురక్షితం చేయడంతోపాటు బ్యాంక్ మోసాలను నిరోధించడానికి ఈ కొత్త నియమాలు రూపొందించారు.
కొత్త నిబంధనల ప్రకారం, చెక్కులను జారీ చేసే వ్యక్తి చెక్ తేదీని ఎలక్ట్రానిక్ పద్ధతిలో గ్రహీత పేరు, చెల్లింపు మొత్తాన్ని తిరిగి తెలియజేయాల్సి ఉంటుంది. చెక్ జారీ చేసే వ్యక్తి ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎం వంటి ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా ఈ సమాచారాన్ని అందించవచ్చు. చెక్ చెల్లింపునకు ముందు ఈ వివరాలను బ్యాంకు సిబ్బంది క్రాస్ చెక్ చేసుకుంటారు. ఏదైనా లోపం కనబడితే, అది 'చెక్ ట్రంకేషన్ సిస్టం' ద్వారా గుర్తించి.. సమాచారాన్ని చెక్ చెల్లింపు చేయవలసిన బ్యాంక్, చెక్ జారీ చేసిన బ్యాంకులకు అందుతుంది. రూ.50 వేలు అంతకంటే ఎక్కువ చెల్లింపుల విషయంలో బ్యాంకులు ఖాతాదారులకు ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. అయితే, ఈ సదుపాయాన్ని పొందాలని ఖాతాదారుడు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.
రూ.5 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువ చేసే చెక్కుల విషయంలో బ్యాంకులు ఈ నిబంధనలను తప్పనిసరి చేయవచ్చు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ వ్యవస్థను అభివృద్ధి చేసి అన్ని బ్యాంకులకు అందుబాటులో తీసుకువచ్చింది. సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బ్యాంకులు ఖాతాదారుల నుంచి ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా సమాచారాన్ని తీసుకుని రుజువు చేసుకున్న తర్వాతనే చెక్‌లను పాస్ చేయాల్సి ఉంటుంది.
👉పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పరిస్థితి ప్రస్తుతం బాగా క్షీణించినట్లు సమాచారం. ఈ మేరకు డాక్టర్ ఉమేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీలు ప్రస్తుతం 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. ఆయన కిడ్నీ పనితీరు ఎప్పుడైనా పూర్తిగా క్షీణించొచ్చు. అది ఎప్పుడు అనేది ఊహించడం కష్టం. కానీ అది ఖచ్చితంగా జరగుతుంది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం.
0 Comments