వ్యవసాయ బిల్లు 2020 వివరణ ..
రైతులు వారి హక్కుల.కోసం రోడ్డెక్కారు, రాజధాని ని ముట్టడిoచారు , ఈ బిల్లుకు వ్యతిరేకంగా నినదించారు. ఎందుకో చూద్దాం ..
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
★కేంద్రము ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులో ముఖ్యంగా 3సాగు చట్టాల గురించి చెప్పుకోవాలి.ఈ 3సాగు చట్టాలు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం రైతులకు మేలు చేయటానికి ఈ కొత్త చట్టాలు అని చెపుతుంది అవేంటంటే👇
1.కాంట్రాక్టు వ్యవసాయానికి చట్టబద్ధత చేయడం.
2.రైతు తన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వేసులుబాటు.(ఏ మార్కెట్ పరిధిలో పంట పండిస్తే అక్కడే అమ్ముకునే విధానం లేకుండా ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు)
3.ఆహార ఉత్పత్తులు ను రైతు ఎంతైనా నిల్వ ఉంచుకునే స్వేచ్ఛనిస్తూ ఈ చట్టం.
వివరణలు :
1.కాంట్రాక్టు వ్యవసాయ చట్టం :
ఈ విధానం ఈ రోజు నా చర్చకు వచ్చినది కాదు గత 25 సంవత్సరాల నుండి ఈ విధానానికి చట్టబద్దత కల్పించే ప్రయత్న రూపమే ఈ చట్టం ,,,
(మనకు తెలిసిన వ్యవసాయలు రెండు ,ఒకటి మన సొంతంగా దున్నుకొని పoడించటం,రెండు కౌలు రైతు కి ఇచ్చి పండించటం.)
అలానే ఈ చట్టం లో రెండు రకాల వ్యవసాయ పద్ధతులు ఒకటి కాంట్రాక్ట్ వ్యవసాయం, రెండు కార్పొరేట్ వ్యవసాయం
★కాంట్రాక్టు వ్యవసాయం అంటే ఒక కంపెనీ రైతు తో పంట పండించటానికి ముందే ఒప్పందం కుదుర్చుకుని ,ఆ ఒప్పందం లో ఏ పంట వేయాలి,పంట దిగుబడి వచ్చాక ఎంత రేటుకు ఆ క్యాంపెనీకి అమ్మాలి అనేది ముందే ఆ కంపెనీ ఒప్పందం లో ఉంటుంది.(రైతు కోణంలో నుండి చూస్తే తాను వేయబోయే పంటకు ఎంత రేటు వస్తుందో ముందే తనకు తెలిసేలా ఆ ఒప్పందం లో ఉంటుంది).కంపెనీ కోణం లో వచ్చిన పంట ఎంత నాణ్యత తో వస్తుంది దానికి వచ్చే లాభం కంపెనీ కి వస్తుంది.ఇద్దరు లాభపడేలా ఈ చట్ట ఉద్దేశ్యం.
(2005 వరకు ఇలా కట్రాక్టు పద్దతి వ్యవసాయం చేయటం నిషేధం ఎందుకంటే ఫార్వర్డ్ ట్రేడింగ్ విధానం అంటే పంట వేసి వచ్చాక రేట్ ఫిక్స్ చేస్తాం కానీ వేయకముందే పంట రేట్ ను నిర్దారణ చేయటం చట్టవ్యతిరేకo.)
ఈ రోజన కాంట్రాక్టు వ్యవసాయానికి చట్టబద్ధత కల్పిస్తూ ఫార్వర్డ్ ట్రేడింగ్ కి 2004 లో ముసాయిదా చట్టం చేయబడింది ఆ ముసాయిదా చట్టం మేరకే ఆయా రాష్ట్రాలు వారి మార్కెట్ చట్టాల్లో మార్పులు చేసుకొని ఈ పద్ధతికి చట్టబద్ధత కల్పించాయి.ఈ క్రమంలో లో 2005 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మార్కెట్ సవరణ చట్టం చేస్తూ సెక్షన్ 11 a లో ఈ కాంట్రాక్ట్ వ్యవసాయానికి రూపకల్పన చేసి,కొన్ని విధానాలు కల్పించాయి ఎవరన్నా ఈ విధానం ద్వారా వ్యవసాయం చేయాలంటే ఆ మార్కెట్ పరిధిలో భూమి రిజిస్టర్ అయి వ్యవసాయo చేయటం, లేదా ఆ మార్కెట్ పరిధి దాటి ఎక్కువ భూమి ఉంటే జిల్లా వ్యవసాయ అధికారి దగ్గర ఆ డ్రాఫ్ట్ నమూనా మేరకు ఒప్పంద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.వివాదం ఏర్పడితే మార్కెట్ కమిటీ వివాదాన్ని తీర్చాలి.
ఒక్క తమిళనాడు మాత్రమే.కొత్తగా కాంట్రాక్టు వ్యవసాయ చట్టాన్ని రూపొందించుకుంది.
ఈ నేపధ్యంలో కేంద్రం ఈ చట్టాన్ని వ్యవసాయ సేవల ఒప్పంద చట్టం అని అంటుంది.పేరు మారిందేకాని మొత్తమ్మీద దాన్నే కాంట్రాక్టు వ్యవసాయానికే చట్ట బద్ధత కల్పించటం. కేంద్రం ఈ చట్టం.లో.కొన్నీ మార్పులు చేర్పులు కల్పించింది అవి, ●వివాదాలు వస్తే మార్కెట్ కమిటీకి సంబంధం లేకుండా నేరుగా రెవెన్యూ యంత్రాoగం ని రూపొందించారు.
●కాంట్రాక్టు వ్యవసాయం చేసుకోనుంటే ఏదైతే రేటు కంపెనీకి చెల్లిస్తుందో అది మినిమం రేటుకు తక్కువ ఉండకూడదు అని కొత్తగా ఈ ఒప్పందం లో రూలు పెట్టారు.
ఇది 2005 లో ఏర్పడిన ముసాయిదా కి కొత్త రూపు తెస్తూ చేసిన ఈ చట్టంలో వివాదాలు వచ్చాయి అవి 👇
■ కాంట్రాక్టు వ్యవసాయo ను ప్రోత్సహిస్తే ఆ పేరుతో భూములన్నీ కంపెనీ ల చేతిలోకి వెళ్లి చివరికి అది కార్పోరేట్ వ్యవసాయానికి దారి తీస్తుంది అని.అంటే కంపనీ లే భూములు కొని సొంతంగా వ్యవసాయo ను మొదలుపెడతామని వాదన.
■సదరు ఒప్పంద రైతు చిన్నవాడు కాబట్టి ఆ ఒప్పంద లాభాలు తక్కువ వచ్చి పూర్తి లాభం పొందలేడని మరో వాదన.
----------------------------------------
2. పంటను ఎక్కడైనా అమ్ముకునే చట్టం :
ఇంతకుముందు పండిన పంట అక్కడే మార్కెట్ యార్డులో వాళ్ళు కల్పించిన లేదా ప్రభుత్వ రేటుకు అమ్మాలి,దీంతో మార్కెట్ సెస్ రైతు కట్టాలి. ఇప్పుడు ఆ అవసరం లేకుండా సొంతంగా రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు,అంతే కాకుండా ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు ను అమ్ముకోవచ్చు అని చెపుతుంది. దీనివల్ల పంట రేట్లు పెరిగి ఉత్పత్తి ఎక్కువ ఉందన్నది ప్రభుత్వం వాదన.దీన్ని వద్దనే వారు ఆన్లైన్ ట్రేడింగ్ ఎక్కువ ఐతే ఈ మార్కెట్ యార్డు లన్నీ నిర్వీయమయ్యే ప్రమాదం ఉందన్నది మరో కోణం.మినిమం సపోర్టింగ్ ప్రైస్ ను ఉంచి దానికి విధిగా రైతు ప్రభుత్వం కి అమ్మలా,ప్రయివేటు కి అమ్మలా అనే వెసులుబాటు కల్పించే లా చేస్తే రైతు బావుంటాడన్నది వివరణ.
----------------------------------------
3.ఉత్పత్తి ఎంతైనా నిలవ స్వేచ్ఛ కల్పించే చట్టం :
★ఇంతకుముందు ఉన్న చట్టం ప్రకారం నిర్దేశించిన క్వoటిటి ప్రకారం ఎక్కడా ఎక్కువ నిల్వ చేసుకునే అవకాశం లేదు, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ నిల్వ స్వేచ్ఛను కల్పించుకునే లా చట్టం. ఒకవేళ రేట్లు విపరీతంగా పెరిగితే అప్పుడు ప్రభుత్వం జోక్యం చేరుకునేలా రూపొందించినారు.కానీ ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు అనుకుంటే కంపెనీలు రైతుల నుండి విపరీతంగా కొనుగోలు చేసి కృత్రిమ కొరత సృష్టిస్తాయి అన్న వాదన, ఈ విధమైన నిల్వలు ఎక్కువ ఉండటంతో రైతులకు ఎక్కువ డబ్బులు మిగిలే అవకాశం అన్నది ప్రభుత్వ వాదన.
ఈ 3 చట్టాల పై వాదనలు జరుగుతున్నాయి.
చివరగా రైతు,వ్యవసాయం రెండు బాగుండాలన్న మరిన్ని మౌలికమైన ప్రశ్నలకి సమాదానాలు వెతకాలి. అవి .
1. ఈ 3చట్టాలు వ్యవసాయ రంగానికి విప్లవాత్మక మార్పులు తీసుకురాలేవు, ఇంతకన్నా మించి మేలు రైతుకి జరగాలి.
1.విత్తనాలు నష్టపోతే విత్తన చట్టం లో నష్టపరిహారం కల్పించే వెసులుబాటు లేదు,
2.రైతు కి కావలసిన రుణాలు ఎందుకు అందటం లేదు,
3.ఎవరు ఏ వస్తువు తయారుచేస్తే ఆ వస్తువు రేటు వారే నిర్ణయించే అవకాశం ఉన్నపుడు రైతులకు ఎందుకు ఆ అవకాశం కల్పించలేకున్నాము.
వీటన్నిటికీ సరైన సమాధానం దొరికినప్పుడే రైతులకు న్యాయం ,వ్యవసాయానికి సాయం అందించినవారం అవుతాం ...
0 Comments