APPSC
ఏపీలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-1 పరిధిలోని మొత్తం 169 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 44 పోస్టులు క్యారీఫార్వర్డ్ పోస్టులు కాగా.. మిగతా 125 కొత్త పోస్టులు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. జనవరి 28 దరఖాస్తుకు చివరితేది. ఫీజు మాత్రం జనవరి 27 వరకు చెల్లించాలి. రెండుదశల రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. మొదటి దశలో స్క్రీనింగ్ (ప్రిలిమ్స్) పరీక్ష, రెండో దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులే మెయిన్ పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష విధానం:.. మొత్తం 240 మార్కులకుగాను.. 240 ప్రశ్నలకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 120 మార్కులు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఒక్కో పేపరుకు 120 నిమిషాల సమయం కేటాయిస్తారు. వీటిలో పేపర్-1లో జనరల్ స్టడీస్ నుంచి, పేపర్-2లో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్-1లో నాలుగు సెక్షన్లు, పేపర్-2లో మూడు సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
0 Comments