APSSDC jobs

 APSSDC jobs




💁‍♀APSSDC jobs: విజయవాడ సీఆర్‌డీఏ పరిధిలో 363 జాబ్స్... టెన్త్ నుంచి డిగ్రీ వరకు అర్హత... రూ.38,000 వరకు వేతనం

🔰ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ-CRDA పరిధిలో పలు ఉద్యోగాలు ఉన్నాయంటూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC ట్విట్టర్‌లో జాబ్ నోటీస్ విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం వేర్వేరు ప్రైవేట్ సంస్థల్లో 363 ఉద్యోగాలు ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, నూజివీడు, వుయ్యూరు, తిరువూరు, గుంటుపల్లి, భవానీపురం, గుడ్లవల్లేరు, మచిలీపట్నం, పామర్రు, గుడివాడతో పాటు హైదరాబాద్, పూణెలో కూడా ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాలకు 2021 జనవరి 29న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. యూర్త్ టెక్‌ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోవ్‌సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్ఆర్ స్క్వేర్ ఎల్ఎల్‌పీ సంస్థలు, APSSDC సంయుక్తంగా ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాయి

🔰ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్నవారు కూడా ఈ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ లో తెలుసుకోవచ్చు.

🎯మొత్తం ఖాళీలు- 363
🎯క్వాలిటీ కంట్రోల్- 2
🎯టెక్నీషియన్- 5
🎯హెల్పర్- 20
🎯టీమ్ లీడర్- 3ఎంఐఎస్ ఎగ్జిక్యూటీవ్- 1
🎯లీడ్ కోఆర్డినేటర్- 1
🎯బ్రాంచ్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్- 25
🎯బ్యాక్ ఎండ్ ఎగ్జిక్యూటీవ్- 5
🎯రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్- 40
🎯యూనిట్ మేనేజర్- 1
🎯జూనియర్ కెమిస్ట్, సేల్స్ రిప్రెజెంటేటీవ్- 260

♦️విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ పాస్ కావాలి.

♦️వయస్సు- 18 నుంచి 35 ఏళ్లు

♦️వేతనం- రూ.8,000 నుంచి రూ.38,000 వరకు. పోస్టును బట్టి వేతనం ఉంటుంది.

♦️పోస్టింగ్ ఇచ్చే ప్రాంతం- విజయవాడ, గుంటూరు, నూజివీడు, వుయ్యూరు, తిరువూరు, గుంటుపల్లి, భవానీపురం, గుడ్లవల్లేరు, మచిలీపట్నం, పామర్రు, గుడివాడ, హైదరాబాద్, పూణె

♦️ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ- 2021 జనవరి 29

♦️రిపోర్ట్ చేయాల్సిన సమయం- ఉదయం 9 గంటలు

♦️ఇంటర్వ్యూ నిర్వహించే స్థలం- కెరీర్ వాక్, రాజ్‌టవర్స్ పక్కన, ఏలూరు రోడ్డు, గవర్నర్‌పేట, విజయవాడ, సీఆర్‌డీఏ రీజియన్.

🔰ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించి APSSDC అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ లో జాబ్ నోటీసులు ఉంటాయి. వేర్వేరు విద్యార్హతలు ఉన్నవారు ఈ వెబ్‌సైట్‌లో జాబ్స్ సెర్చ్ చేయొచ్చు. మరిన్ని వివరాలకు 1800 4252 422 నెంబర్‌కు కాల్ చేయాలి.





JOIN IN OUR WATSUP: CLICK HERE

JOIN IN OUR TELIGRAM GROUP: CLICK HERE


PLEASE VISIT MY WEBSITE: CLICK HERE









Post a Comment

0 Comments