--01.01.2021--
👉 ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. కొవిడ్ నేర్పిన పాఠాలను మరచిపోకుండా... నూతన సంవత్సరంలోనూ పాఠించాలని సూచించారు.
👉 సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్. మే 4 నుంచి జూన్ 10 వరకు సీబీఎస్‌ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
👉 ప్రభుత్వానికి తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదికను అందించింది. 2018 మే లో సీఆర్ బిస్వాల్ నేతృత్వంలో మహ్మద్ రఫత్ అలీ, ఉమామహేశ్వరరావు సభ్యులుగా పీఆర్‌సీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
👉 దా'రుణ' యాప్‌ల కేసును సైబర్ క్రైం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కీలక సూత్రదారి చైనాకు చెందిన ఝ.. వి.. ల్యాంబో అరెస్టు కావటంతో..రుణాలు ఇవ్వడానికి డబ్బు ఎక్కడ నుంచి వస్తోంది అనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు.
👉 హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ హిమా కోహ్లి నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి నోటిఫికేషన్ జారీచేసింది.
👉 కొత్త సంవత్సరం వేడుకల్లో మాదకద్రవ్యాల సరఫరా ముఠాలు రెచ్చిపోయే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ ముందస్తు అంచనా వేసింది. మాదకద్రవ్యాల సరఫరాను నిలువరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
👉 కోతిని తరమబోయి ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురైన ఘటన కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. కోతుల బెడద ఎక్కువుందని ఇనుప రాడ్‌తో తరిమేందుకు యత్నించగా... రాడ్ విద్యుత్ తీగలకు గురై అశోక్ అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు.
👉 తరగతి గదిలో తన సీట్లో కూర్చున్నాడన్న కోపంతో 14 ఏళ్ల విద్యార్థి తన తోటి విద్యార్థిని కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలో జరిగింది.
👉 పట్టభద్రుల ఎన్నికల్లో విదేశీ డిగ్రీలను అనుమతించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు జనవరి 6 లోపు వివరణ ఇవ్వాలని ఈసీ, సీఈఓలను ఆదేశించింది.
👉 నూతన సంవత్సరం ప్రారంభానికి ముందు వినియోగదారులకు రిలయన్స్ జియో శుభవార్త చెప్పింది. జియో నుంచి దేశంలోని ఇతర నెట్వర్క్ లకు చేసే కాల్స్ అన్నీ ఇకపై ఉచితమేనని ప్రకటించింది. ఈ విధానం జనవరి 1 నుంచి అమలవుతుందని తెలిపింది. ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జ్ విధానం నేటితో ముగిసిపోనుండడమే ఇందుకు కారణమని తెలిపింది రిలయన్స్ జియో.
👉హైదరాబాద్: ప్రతీ ఏడాది నూతన సంవత్సరం మొదటి రోజున మొదలయ్యే నాంపల్లి ఎగ్జిబిషన్ తాత్కాలికంగా వాయిదా పడింది. రేపటి నుంచి ప్రారంభంకావాల్సిన నాంపల్లి ఎగ్జిబిషన్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ ఎగ్జిబిషన్‌ను తిరిగి మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
👉హైదరాబాద్: లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్‌గౌడ్ కన్నుమూశారు. అనారోగ్యంతో రమేష్‌గౌడ్ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఇంకా కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం చేయకముందే మృతిచెందడంతో బీజేపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. రమేష్‌గౌడ్ మృతి వార్త తెలుసుకున్న బీజేపీ నేతలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
👉 నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేయడకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్బులకు, బార్‌లకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి ప్రజలను ఏం చేద్దామనుకుంటున్నారని ఘాటుగా ప్రశ్నించింది.
0 Comments