ARE U READY FOR UPSC CIVILS PRELIMS EXAMS ? - GIDENCE

                                            



పరీక్ష విధానం

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో 3 దశలు ఉంటాయి. అవి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, వ్యక్తిత్త్వ పరీక్ష (ప్రిలిమ్స్‌ ఆబ్జెక్టివ్‌ రూపంలో, మెయిన్స్‌ డిస్క్రిప్టివ్‌ రూపంలో ఉంటాయి). 

ప్రిలిమ్స్‌: 2 పేపర్లు (పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌, 100 ప్రశ్నలు, 200 మార్కులు)

    (పేపర్‌-2 సీశాట్‌, 80 ప్రశ్నలు, 200 మార్కులు)

గమనిక: పేపర్‌-1 కటాఫ్‌ ప్రతిఏడాది మారుతూ ఉంటుంది.

సీశాట్‌ పేపర్‌-2 అర్హత సాధించాలంటే కనీసం 33% మార్కులు సాధించాలి. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది.
మెయిన్‌: 9 పేపర్లు 

1. జనరల్‌ ఎస్సే 250 మార్కులు 

2. జనరల్‌ స్టడీస్‌-1: హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్‌ సొసైటీ 250 మార్కులు

3. జనరల్‌ స్టడీస్‌-2: పాలిటీ, గవర్నెన్స్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ 250 మార్కులు

4. జనరల్‌ స్టడీస్‌-3: ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, టెక్నాలజీ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్నల్‌ సెక్యూరిటీ 250 మార్కులు

5. జనరల్‌ స్టడీస్‌-4: ఎథిక్స్‌, ఇంటిగ్రిటీ ఆప్టిట్యూడ్‌

6. కంపల్సరీ ఇండియన్‌ లాంగ్వేజ్‌ (అర్హత పరీక్ష): 300 మార్కులు

7. ఇంగ్లిష్‌ (అర్హత పరీక్ష): 300 మార్కులు

8. ఆప్షనల్‌ పేపర్‌-1: 250 మార్కులు

9. ఆప్షనల్‌ పేపర్‌-2: 250 మార్కులు 

వ్యక్తిత్త్వ నిర్ధారణ పరీక్ష: 275 మార్కులకు ముఖాముఖి పద్ధతిలో నిర్వహిస్తారు.

మరికొన్ని సూచనలు


గతంలో సీ శాట్‌ అనే పేపర్‌ నిర్లక్ష్యం చేయడంవల్ల అభ్యర్థులు దానిలో కనీస మార్కులు సాధించలేకపోయారు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉండటం వల్ల సమాధానాలు గుర్తించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సమయ పాలన, సమయ స్ఫూర్తి రావాలంటే ముందుగా పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌ చేసి వెళ్తే చాలా ఉపయోగం ఉంటుంది. తొందరపాటుతో సమాధానాలు గుర్తించి కూడా కొంతమంది పరీక్షలో విఫలమవుతుంటారు. కాబట్టి ముందే ప్రణాళిక వేసుకొని ఏ విధంగా ప్రశ్నపత్రాలను సమగ్రంగా అర్థం చేసుకొని రాయాలో తెలుసుకుంటే మంచిది. 

లక్షల మంది పోటీపడే పరీక్షలో కేవలం 712 పోస్టులు ఉండటంతో ఈ ఏడాది ప్రిలిమ్స్‌ క్వాలిఫై అయ్యే అభ్యర్థులు సుమారుగా 8500 మంది ఉండవచ్చు. మొత్తం పోస్టుల్లో 22 పోస్టులు దివ్యాంగులకు కేటాయించారు. కాబట్టి ప్రిలిమ్స్‌లో వడపోత (కటాఫ్‌ మార్కులు) కొంత కఠినంగా ఉండవచ్చు. 

జూన్‌ 27న నిర్వహించే ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైతే సెప్టెంబర్‌ 17న నిర్వహించే మెయిన్స్‌కు అర్హత లభిస్తుంది. కానీ ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు మధ్య సమయం తక్కువగా ఉండటం వల్ల మెయిన్స్‌కు కూడా సమగ్రంగా ప్రిపేర్‌ అయి ప్రిలిమ్స్‌ రాయడం మంచిది. ఈ రోజు నుంచి రోజుకి 12 గంటల ప్రణాళిక వేసుకొని ప్రిలిమ్స్‌ కోసం ప్రత్యేక ప్రిపరేషన్‌ ఆరంభించాలి. దానిలో సగభాగాన్ని కాన్సెప్టువల్‌ క్లారిటీ కోసం మిగతా సగ భాగాన్ని ప్రాక్టీస్‌ చేయడం కోసం వినియోగించుకోవాలి.



              FOR DAILY UPDATES PLEASE JOIN WITH US







For Copyright Claim Text us  jupscaspirentsacademy@gmail.com





Post a Comment

0 Comments